ఇరవయ్యవ శతాబ్దపు భాషాశాస్త్ర కోవిదులలో ఎన్నదగ్గ వ్యక్తి ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి (19 జూన్, 1928 - 11 ఆగష్టు, 2012). భాషా శాస్త్రాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి, అధ్యాపనం చేయగల సత్తా నిరూపించుకున్న పండితుడు భద్రిరాజు కృష్ణమూర్తి. ద్రావిడ భాషాశాస్త్రవిజ్ఞానిగా ఈయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. గత శతాబ్దంలో ఆధునిక శాస్త్ర పద్ధతులలో ద్రావిడభాషా పరిశోధనను జరిపి ద్రావిడభాషాధ్యయన రంగానికి శాస్త్రీయతను కూర్చి స్థిరమైన పునాది ఏర్పరచిన వారిలో ముఖ్యులు. ఈయన 2003 లో రచించిన ద్రవిడియన్ లాంగ్వేజెస్ (Dravidian Languages) పుస్తకం గత రెండు శతాబ్దాల్లో ద్రావిడ భాషాధ్యనంలో సాధించిన అభివృద్ధిని సాధికారకంగా చర్చించి నేటి తరం ద్రావిడ భాషా శాస్త్రజ్ఞుల పాలిటి ప్రమాణ గ్రంథంగా నిలిచిందని చెప్పవచ్చు. ద్రావిడ భాషా తత్వాన్ని గురించి, తెలుగు ధాతువుల ప్రాతిపదిక స్వరూప స్వభావాల గురించి, తెలుగు భాష నవీకరణ గురించి ఎన్నెన్నో పరిశోధనా గ్రంథాలు, వ్యాసాలు రచించాడు.
భద్రిరాజు కృష్ణమూర్తి గారు ఏ సంవత్సరంలో మరణించారు ?
Ground Truth Answers: 2012
Prediction:
పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో 1955లోమర్రీ బీ. ఎమెనో భాషాశాస్త్రంలో పరిశోధన గావించి పి.హెచ్.డీ. పట్టం పొందిన భద్రిరాజు కృష్ణమూర్తి 1928 జూన్ 19 తేదీన ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించాడు. ఆంధ్ర, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయాల తెలుగు శాఖలలో 1949-62 మధ్య లెక్చరర్ గాను, రీడర్ గానూ, 1962 నుంచి 1986 దాకా ఉస్మానియా విశ్వవిద్యాలయం భాషాశాస్త్ర శాఖలో తొలి ఆచార్యులుగానూ పనిచేసాడు. 1986 నుంచి 1993 వరకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్-చాన్సలర్ గా ఉన్నాడు. అమెరికాలోని వివిధ విశ్వవిద్యాలయాలలోనూ, ఆస్ట్రేలియా, జపాన్ విశ్వవిద్యాలయాల్లోనూ ఆహుత ఆచార్యులుగా పనిచేసాడు. రష్యా, జర్మనీ, ప్రాన్స్, కజికిస్తాన్ మొదలైన దేశాల్లో పర్యటించాడు. దేశ విదేశాలలోని విశ్వవిద్యాలయాల్లో ఉన్నత పరిశోధన సంస్థల్లో ప్రతిష్ఠాత్మకమైన పెలోషిప్లు, సభ్యత్వాలు పొందాడు. ఎమెనో గారి ప్రియ శిష్యుడు. అమెరికన్ లింగ్విస్టిక్ సొసైటీ గౌరవ సభ్యుడిగా 1985లో ఎన్నికయ్యాడు. భారత కేంద్ర సాహిత్య అకాడెమీ నిర్వాహక సభ్యుడుగా కూడా కొంతకాలం పనిచేసాడు. భద్రిరాజుకు భార్య, ముగ్గురు కుమారులు, ఓ కూతురు ఉన్నారు.11.8.2012 న హైదరాబాదులో కన్నుమూశారు.
భద్రిరాజు కృష్ణమూర్తి గారు ఏ సంవత్సరంలో మరణించారు ?
Ground Truth Answers: 20122012
Prediction: